విధుల్లో చేరిన ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు

విధుల్లో చేరిన ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు

తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు 44 మంది ట్రాన్స్‌జెండ‌ర్లు ట్రాఫిక్ కానిస్టేబుళ్లుగా ఎంపిక‌య్యారు. నేటి నుంచి వీరు, న‌గ‌రంలోని వివిధ సిగ్న‌ల్స్ వ‌ద్ద ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయ‌నున్నారు. ఎంపికైన కానిస్టేబుళ్ల డ్రిల్‌ను బంజారాహిల్స్‌లోని క‌మాండ్ కంట్రోల్‌లో నిర్వ‌హించ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి సీపీ ఆనంద్ హాజ‌రై ప‌రిశీలించారు. ప్ర‌భుత్వం ఎంతో న‌మ్మ‌కంతో ఇచ్చిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన పటిష్ఠమైన శిక్షణను పూర్తిచేశారు. ప్రస్తుతం వీరి శిక్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నియామకం ట్రాన్స్ జెండర్ సముదాయానికి గౌరవాన్ని చాటుతూ, వారి సామాజిక జీవితంలో ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, పైలెట్ ప్రాజెక్టు కింద 44 మందితో న‌గ‌రంలో ట్రాఫిక్ నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఇది విజ‌య‌వంత‌మైతే మ‌రింత మంది ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు అవ‌కాశం ద‌క్కనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment