టీమిండియా (Team India) జెర్సీ (Jersey) స్పాన్సర్షిప్ (Sponsorship)లో మరోసారి పెనుమార్పులు ఉండబోతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటివరకు స్పాన్సర్‌గా ఉన్న ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 (Dream11) వైదొలగడంతో, జెర్సీపై ఖాళీగా ఉన్న ఆ స్థానం కోసం ప్రముఖ కంపెనీల మధ్య పోటీ మొదలైంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా (Toyota) ఈ రేసులోకి దిగినట్లు సమాచారం.
ఎన్డీటీవీ (NDTV) నివేదిక ప్రకారం.. బీసీసీఐ(BCCI) కొత్త స్పాన్సర్ కోసం అన్వేషణలో ఉంది. ఇప్పటికే టయోటా పేరు బలంగా వినిపిస్తోందని, దీనిపై చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. తుది నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
టీమిండియా జెర్సీపై లోగో (Logo) ఉండటం అంటే ఆ బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ గుర్తింపు లభించడం. టయోటా లాంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ స్పాన్సర్‌గా వస్తే, అది బీసీసీఐకే కాకుండా భారత క్రికెట్‌కు కూడా ప్రాధాన్యతను మరింత పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
🚨 NEW SPONSOR ON TEAM INDIA'S JERSEY 🚨
— Tanuj (@ImTanujSingh) August 25, 2025
– Toyota Motor Corporation and a Fintech start up have have all shown interest in becoming Team India's title Jersey sponsor following Dream XI's exit. (NDTV). pic.twitter.com/PiJI7x1TwB








