ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలైన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (‘Tourist Family’) అంచనాల్ని తలకిందులుగా చేస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించింది.
ఈ విజయానికి మూలకారణమైన క్రియేటివ్ బ్రెయిన్ ఎవరో తెలుసా? ఆయనే అభిషన్ జీవింత్ (Abhishan Jeevinth). దర్శకుడిగా తన తొలి చిత్రంతోనే ఇలా బ్లాక్‌బస్టర్ కొట్టడంతో, అభిషన్ తదుపరి ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో భారీ ఆసక్తి నెలకొంది. అయితే, అందరి అంచనాలకు భిన్నంగా అభిషన్ ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
దర్శకుడి నుంచి హీరోగా మార్పు
తన తదుపరి ప్రాజెక్ట్‌లో హీరో(Hero)గా నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను సౌందర్యా రజనీకాంత్ సంస్థ జియాన్ పిక్చర్స్ మరియు ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. దర్శకత్వ బాధ్యతలు మదన్ చేపట్టనున్నారు.
ఈ చిత్రంలో అభిషన్‌కు జోడీగా మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ (Anaswara Rajan) నటించబోతున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ కూడా సమీపంలోనే ఉంది.
యాక్టింగ్‌పై ఎప్పటి నుంచో ఆసక్తి
ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, అభిషన్‌కి యాక్టింగ్‌పై ఆసక్తి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, తన మొదటి ప్రేమ అయిన దర్శకత్వం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడట. ఇప్పుడు తన మలచుకున్న కలను నిజం చేసుకుంటూ హీరోగా తెరంగేట్రం చేయనుండడం, సినీ ప్రేమికుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తోంది.








