ట‌మాటా రైతు కంట క‌న్నీరు.. రోడ్ల‌పై పార‌బోత

ట‌మాటా రైతు కంట క‌న్నీరు.. ర‌వాణా ఖ‌ర్చులూ రాక‌ అన‌కాప‌ల్లిలో రోడ్ల‌పై పార‌బోసి నిర‌స‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో రైతుల (Farmers) ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. అన‌కాప‌ల్లి జిల్లా (Anakapalli District)రైతులు ఈ సీజ‌న్ లో ట‌మాటా పండించిన ట‌మాటా పంట‌కు ధ‌ర (Tomato Crop Price) ల‌భించ‌క ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. కూర‌గాయ‌ల రారాజుగా పేరుగాంచిన ట‌మాటా కిలో రూ.2కి ప‌డిపోయింది. దీంతో అన్న‌దాత కంట‌క‌న్నీరు (Tears) మిగులుతోంది. ప్రత్యేకంగా దేవరాపల్లి కాయగూరల మార్కెట్‌కు (Devarapalli Vegetable Market) పంటను తీసుకువచ్చిన అన్నదాతలకు గుండెకోతే మిగిలింది.

కోత, రవాణా ఖర్చులు కూడా ద‌క్క‌క‌పోవ‌డంతో రైతులు నిర‌స‌న‌గా రోడ్లపైనే (Roads) టమాటాలను పారబోసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో కిలోకు రూ.20–30 లభించిన టమోటా ఒక్కసారిగా కూలిపోవడంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. టమాటా ధరల పతనానికి ప్రధాన కారణం ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడమేన‌ని చెబుతున్నారు. దేవరాపల్లి మండలం లోని దేవరాపల్లి, నాగయ్యపేట, కొల్లివానిపాలెం, మారేపల్లి, చిననందిపల్లి, పెదనందిపల్లి, సీతంపేట, వెంకటరాజుపురం మరియు ఇతర గ్రామాల నుంచి పండిన పంటను వ్యాపారులు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. పంట ఉత్పత్తి పెరగడం, దిగుబడులు అధికంగా రావడం వలన మార్కెట్‌లో సరఫరా పెరిగింది. దీంతో ధరలు క్రమంగా ప‌డిపోయాయి. రైతులకు ఆశించిన లాభం ద‌క్క‌డం లేదు.

ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధరను ప్రకటించి, నేరుగా పంటను కొనుగోలు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా, కోల్డ్ స్టోరేజ్ (Cold Storage) సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా పంట నిల్వ చేసి, ధరల సమస్యను నియంత్రించవచ్చని సూచిస్తున్నారు. లేకపోతే, ఈ పరిస్థితి మరింత పెరిగి త‌మ‌కు ఆత్మ‌హ‌త్య‌లే గ‌తి అవుతాయ‌ని రైతులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment