టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతసెలగంశెట్టి కేదార్ దుబాయ్‌లో అనారోగ్యంతో మృతి చెందడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. దుబాయ్ పోలీసులు ఈ మరణాన్ని సహజమరణంగా ప్రకటించినా, కేదార్ మృతిపై అనుమానాలు పెరుగుతున్నాయి.
కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ విజ్ఞప్తి
కేదార్ మృతిపై నిస్పక్షపాత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. BRS పార్టీకి చెందిన కొంతమంది నాయకుల ప్రమేయంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, అసలు నిజాలు వెలుగులోకి రావాలంటే కేంద్రం జోక్యం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేదార్ కుటుంబ సభ్యుల ఆవేదన, సినీ పరిశ్రమలో నెలకొన్న అనుమానాలు ఈ కేసుపై సమగ్ర దర్యాప్తునకు నాంది కావాలని పేర్కొన్నారు.








