---Advertisement---

అక్కినేని నుంచి అల్లు వ‌ర‌కు.. 2024లో సంచ‌ల‌న ఘ‌ట్టాలు

అక్కినేని నుంచి అల్లు వ‌ర‌కు.. 2024లో సంచ‌ల‌న ఘ‌ట్టాలు
---Advertisement---

2024 సంవ‌త్స‌రంలో తెలుగు ఇండ‌స్ట్రీకి విజ‌యాలు ఎలా వ‌రించాయో.. వివాదాలు సైతం అదే స్థాయిలో వెంటాడాయి. ఒకర‌కంగా టాలీవుడ్‌లో ఈ ఏడాది చెల‌రేగిన వివాదాలు దేశాన్ని కుదిపేశాయ‌నే చెప్పాలి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప-2 వంటి సినిమాలు తెలుగు సినిమా ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినప్పటికీ, ఈ ఏడాది టాలీవుడ్ వివాదాలు మాత్రం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా నిలిచాయి. అగ్ర నటులు, రాజకీయ ఆరోపణలు, డ్రగ్స్ కేసులు, కుటుంబ తగాదాలు, అరెస్టులు ఇలా ఈ ఏడాది జ‌రిగిన ప్ర‌ధాన ఘ‌ట్టాల‌ను ప‌రిశీలిస్తే..

నాగార్జున ఎన్-కన్వెన్షన్ వివాదం
అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌-క‌న్వెన్ష‌న్‌ను హైడ్రా కూల్చివేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఆయన ఎన్-కన్వెన్షన్‌ను చెరువు కబ్జా పేరుతో కూల్చివేయడమే. నాగార్జున దీనిపై న్యాయపోరాటానికి దిగగారు. ఇది వ్యక్తిగత విషయం అయిన‌ప్ప‌టికీ దీనిపై ఇండ‌స్ట్రీలో మొత్తం చ‌ర్చ జ‌రిగింది.

అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ ఆరోపణలు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని, సినిమా ఇండ‌స్ట్రీని, అక్కినేని ఫ్యామిలీని ప‌రువుకు తీవ్ర భంగం క‌లిగించేలా చేశాయి. సమంత-నాగచైతన్య విడాకుల వెనుక రాజకీయ హస్తం ఉందని ఆరోపించిన సురేఖ, రకుల్ ప్రీత్ సింగ్‌ను కూడా వివాదంలోకి లాగారు. చివరకు ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ, నాగార్జున కోర్టుకు వెళ్లి పరువునష్టం దావా వేశారు.

బెంగళూరు రేవ్ పార్టీ కేసు
రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకం పట్ల బెంగళూరు పోలీసులు చేసిన దాడి టాలీవుడ్‌కు సంబంధించి సంచలనమైంది. ప్రముఖ నటి హేమ అరెస్టు అయ్యి, బెయిల్ మీద విడుదలయ్యారు.

జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు టాలీవుడ్‌కు మచ్చగా నిలిచాయి. మైనర్‌పై అత్యాచారం ఆరోపణలతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదై, అరెస్టు జరిగి, కోర్టు విచారణ కూడా కొనసాగుతోంది.

మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదా
మోహన్ బాబు, మనోజ్ మధ్య ఆస్తి వివాదాలు భౌతిక దాడుల వరకు దారితీశాయి. జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి చేయడం మరో వివాదంగా మారింది. చివరకు క్షమాపణలు చెబుతూ ఘటనను సర్దిచెప్పుకున్నారు.

అల్లు అర్జున్ అరెస్టు
సంధ్య థియేట‌ర్ వ‌ద్ద‌ పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించడంతో, అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయడం, అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపడం, మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు ఇదంతా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నెటిజన్లు ఈ అరెస్టును రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment