హీరోయిన్ల‌పై శివాజీ అస‌భ్య‌వ్యాఖ్యలు.. నెటిజ‌న్లు ఆగ్ర‌హం

హీరోయిన్ల‌పై శివాజీ అస‌భ్య‌వ్యాఖ్యలు.. నెటిజ‌న్లు ఆగ్ర‌హం

‘దండోరా’ (Dandora) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (Pre-Release Event)లో నటుడు శివాజీ (Actor Shivaji) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై మాట్లాడుతున్న సమయంలో మహిళలు (Women), హీరోయిన్ల (Heroines) దుస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా, అవమానకరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ, మహిళల ఆధునిక దుస్తులపై (Modern Clothing of Women) వ్యాఖ్యానిస్తూ “మీ సామాన్లు (Private Parts) కనపడేలా బట్టలు వేసుకుంటే మీకే ఇబ్బంది” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆధునిక దుస్తులు ధరించిన మహిళలను చూసినప్పుడు బయటికి నవ్వుతూ, లోపల మాత్రం “దరిద్రపు ముండా… ఇలాంటి బట్టలు వేసుకున్నావేంటి? కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా” అని అనిపిస్తుందని చెప్పడం తీవ్ర దుమారం రేపింది.

‘సామాన్లు’ వంటి పదాలను వాడటం, మహిళలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక బహిరంగ వేదికపై, సినిమా ఈవెంట్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం కాదని, మహిళలపై ద్వేషాన్ని, అవమానాన్ని ప్రోత్సహించే మాటలుగా అభివర్ణిస్తున్నారు.

ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు శివాజీపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. “మహిళల దుస్తులు వారి వ్యక్తిగత స్వేచ్ఛ, ఇది 2020ల కాలం, ఇలాంటి ఆలోచనలు అసహ్యకరం, బహిరంగ వేదికపై మాట్లాడేటప్పుడు బాధ్యత ఉండాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు మాత్రం సినిమా పరిశ్రమలో ఉన్న వ్యక్తులు, ప్రజల ముందు మాట్లాడే సెలబ్రిటీలు మహిళలపై గౌరవంగా మాట్లాడాల్సిన బాధ్యత ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు యువతపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఘటనపై మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment