తిరువూరు ఎన్నికపై ఆర్డీవో సంచ‌ల‌న నిర్ణ‌యం.. వీడియో వైర‌ల్‌

తిరువూరు ఎన్నికపై ఆర్డీవో సంచ‌ల‌న నిర్ణ‌యం.. వీడియో వైర‌ల్‌

హైటెన్ష‌న్ న‌డుమ తిరువూరు (Tiruvuru) మున్సిపల్ చైర్మన్ ఎన్నిక (Municipal Chairman Election) నిరవధికంగా వాయిదా (Postponed) పడింది. నిన్న‌, ఇవాళ‌ కోరం లేకపోవడంతో ఫ‌లితం తేల‌కుండానే ఈ ఎన్నికను ముగించినట్లు ఎన్నికల రిట‌ర్నింగ్ అధికారి, ఆర్‌డీఓ (RDO) కే. మాధురి (K. Madhuri) ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం తిరువూరు మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక‌కు సంబంధించిన‌ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

తిరువూరు మున్సిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండ‌గా, వైసీపీకి 17 మంది సభ్యుల బలం ఉంది. మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక‌తో ఉప ఎన్నిక ఏర్ప‌డింది. సోమ‌వారం ఉప ఎన్నిక నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసిన‌ప్ప‌టికీ తిరువూరు ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. టీడీపీ నేతలు (TDP Leaders) ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. నిన్న‌, ఇవాళ రెండ్రోజులు వైసీపీ కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్‌లోకి వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని, ఈ ఘటనలో టీడీపీ నేత రమేష్ రెడ్డి (Ramesh Reddy), ఇతర కార్యకర్తలు పోలీసు వాహనాలపై దాడి చేశారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ (Devineni Avinash), ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌లను (Monditoka Arun Kumar) పోలీసులు అరెస్టు చేసి రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాలను అడ్డుకుని, దాడి చేసిన ఘటనలు ఉద్రిక్తతకు దారితీశాయి.

హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ భద్రతా లోపం
హైకోర్టు ఆదేశాల మేరకు వైసీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించాల్సి ఉన్నప్పటికీ, పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదని వైసీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ నేతల దాడుల కారణంగా వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరు కాలేకపోయారని, దీంతో కోరం లేకపోవడంతో ఎన్నిక నిరవధికంగా వాయిదా పడిందని వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘటనను “ప్రజాస్వామ్య ఖూనీ” (“Murder of Democracy”)గా వైసీపీ అభివ‌ర్ణిస్తుంది. ముగ్గురు కౌన్సిలర్ల బలంతో టీడీపీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి దౌర్జన్యాలకు పాల్పడిందని, పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు
నిన్న కోరం లేక వాయిదా ప‌డిన ఎన్నిక‌.. ఈ రోజు కూడా అదే ప‌రిస్థితి త‌లెత్తింద‌ని, ఇక ఈ ఎన్నిక‌ను ముగించ‌డం జ‌రుగుతుంద‌ని ఆర్‌డీఓ కే. మాధురి ప్ర‌క‌టించారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక స‌మ‌ర్పిస్తామ‌ని, ఈసీ ఆదేశాల ప్రకారం తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఇంత‌టితో తిరువూరు మున్సిప‌ల్ ఎన్నిక ముగిసిన‌ట్లుగా ఆర్డీవో మాధురి ప్ర‌క‌టించారు. ఎన్నిక వాయిదా వేస్తున్న‌ట్లుగా ఆర్డీఓ ప్ర‌క‌టించిన‌ వీడియోతో పాటు వైసీపీ నేత‌ల వాహ‌నాల‌ను టీడీపీ శ్రేణులు అడ్డుకున్న వీడియోలు, కార్ల ధ్వంసం దృశ్యాలు వైర‌ల్‌గా మారాయి. టీడీపీ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment