విద్యార్థిని గ‌ర్భ‌వ‌తిని చేసిన ప్రొఫెస‌ర్‌.. తిరుప‌తిలో దారుణం

విద్యార్థిని గ‌ర్భ‌వ‌తిని చేసిన ప్రొఫెస‌ర్‌.. తిరుప‌తిలో దారుణం

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఫస్ట్‌ ఇయర్ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక దాడి చేసి గ‌ర్భ‌వ‌తిని చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. చ‌దువుకునేందుకు ఒడిశా నుంచి తిరుప‌తి సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి వ‌చ్చిన యువ‌తిపై అఘాయిత్యానికి పాల్ప‌డ‌డం సంచ‌లనంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. యూనివ‌ర్సిటీలో (డిపార్ట్‌మెంట్ రాయ‌లేదు) ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న విద్యార్థిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ల‌క్ష్మ‌ణ్‌కుమార్ ఆమెను లోబరుచుకొని గ‌ర్భ‌వ‌తిని చేశాడు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న స‌మ‌యంలో మ‌రొక అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రెగ్నెంట్ అని తెలిసిన విద్యార్థిని త‌నను లైంగికంగా వేధించిన అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌పై విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సంఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టిన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కోసం యూనివర్సిటీ స్టాఫ్ తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, బాధిత విద్యార్థినే ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయాలంటూ పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో, సంఘటన అనంతరం విద్యార్థిని ఒడిశాకు వెళ్లినట్లు సమాచారం. మొత్తం కేసును పోలీసులు, విశ్వవిద్యాలయ అధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment