తిరుపతి (Tirupati) లోని ఓ ప్రఖ్యాత నర్సింగ్ కాలేజీలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. లీలామహల్ సర్కిల్‌లో ఉన్న వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్ (Varma College Nursing Hostel) లో అర్ధరాత్రి (Midnight) సమయంలో ప్రిన్సిపల్ వర్మ (Principal Varma) విద్యార్థినుల (Students) గది (Room)లో ప్రవేశించారు. అయితే, అప్రమత్తమైన విద్యార్థినులు వర్మను గదిలో నిర్బంధించి, ఈ ఘటనపై అలిపిరి పోలీసులకు (Alipiri Police) సమాచారం ఇచ్చారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు రంగంలోకి దిగారు. ప్రిన్సిపల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ సంఘటన తరువాత విద్యార్థినులు అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు (Protest) దిగారు. ప్రిన్సిపల్ వర్మపై కఠినంగా శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కొంతమంది స్టూడెంట్స్ ప్రిన్సిపల్‌కు మద్దతుగా నిలిచారు. కొందరు విద్యార్థినులు వేరే చోటుకు వెళ్తుంటే వారిని నిలవరించేందుకే ఆయన వెళ్లారంటూ చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అలిపిరి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు. విచారణ అనంతరం, ప్రిన్సిపల్ వర్మపై లైంగిక వేధింపుల కేసు (Sexual Harassment Case) నమోదు చేసినట్టు తెలిపారు.
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య