తిరుపతిలో దారుణం.. దళిత యువతిపై అత్యాచారం

తిరుపతిలో దారుణం.. దళిత యువతిపై అత్యాచారం

టెంపుల్ సిటీ తిరుప‌తి (Tirupati)లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ మండలం పేరూరు (Peruru)కు చెందిన 19 ఏళ్ల దళిత యువతి (19-year-old Dalit woman)పై కడప జిల్లాకు చెందిన ఓ యువకుడు అత్యాచారం (Sexual Assault) చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల సమాచారం మేరకు.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతిని నిందితుడు మాయమాటలు చెప్పి తిరుపతిలోని టౌన్ హౌస్ హోటల్‌ (Town House Hotel)కు తీసుకెళ్లాడు. అక్కడ హోటల్ రూమ్ నెంబర్ 114లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం తీవ్ర మానసిక వేదనకు గురైన బాధిత యువతి, తన తల్లితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే చర్యలు ప్రారంభించారు.

అత్యాచారం జరిగిన టౌన్ హౌస్ హోటల్‌కు పోలీసులు చేరుకుని, క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. ఘటనపై క్రైమ్ నెంబర్ 44/2026 కింద కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. ఈ ఘటన తిరుపతిలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. సోషల్ మీడియా ద్వారా యువతులను మోసగిస్తున్న నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment