తిరుప‌తిలో ద‌ళితులపై దాడులు.. రాడ్లు, క‌ర్ర‌ల‌తో బీభత్సం

తిరుప‌తిలో ద‌ళితులపై దాడులు.. రాడ్లు, క‌ర్ర‌ల‌తో బీభత్సం

తిరుపతి (Tirupati) జిల్లా చంద్రగిరి (Chandragiri) నియోజకవర్గంలో టీడీపీ(TDP) కార్యకర్తలు అరాచకం సృష్టించారు. ఆదివారం రాత్రి దుర్గ సముద్రంలో వినాయక నిమజ్జనం (Vinayaka Immersion) సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణ దళిత వాడలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ కార్య‌క‌ర్త‌లు(TDP Workers) దళితుల (Dalits)పై ఇనుప రాడ్లు (Iron Rods), కర్రల (Sticks)తో దాడి చేయగా, ఆరుగురు రక్తగాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. ఐదు ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

బాధితులు మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం గొడవ అనంతరం రాజీ ప్రయత్నం జరిగిందని, ఎంపీటీసీ సమక్షంలోనే రాజీ కుదిరిందని తెలిపారు. అయినప్పటికీ, తిరుపతి నుంచి కిరాయి వ్యక్తులను పిలిపించి దళిత వాడలో త‌మ‌ ఇళ్లపై దాడులు జరిపించారని ఆరోపించారు.

“ఈ కూటమి ప్రభుత్వం వేస్ట్‌, మమ్మల్ని కొట్టమని చంద్రబాబే కిరాయి రౌడీల‌ను పంపిస్తున్నాడా?” అని బాధితులు ప్రశ్నించారు. టీడీపీ దాడులు ఆగకపోతే తాము కూడా తిరగబడతామని హెచ్చరించారు. “మమ్మల్ని కొట్టి మ‌హా అయితే చంపేస్తారు.. కానీ మేము తిర‌గ‌బ‌డితే పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూసుకోవాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై పగబట్టి దాడులు చేశార‌ని, ఇదే ప‌రిస్ధితి కొన‌సాగితే ఊరుకునేది లేద‌ని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment