తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీకాళహస్తి (Srikalahasti)లో కానిస్టేబుల్ (Constable)పై రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ ( MLA Wife’s Driver) దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దాడిని కప్పిపుచ్చేందుకు ఎమ్మెల్యే ఇంట్లోనే సెటిల్‌మెంట్ జరిగిందన్న వార్త చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రీకాళహస్తి ఘటన అధికార తెలుగుదేశం పార్టీ (TDP) నేతల తలబిరుసు తనానికి నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ ఏమైందంటే..
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి (Bojjala Sudheer Reddy) భార్య (Wife) రిషిత రెడ్డి (Rishitha Reddy) కారు డ్రైవర్ సాయి కుమార్ (Car Driver Sai Kumar) మద్యం మత్తులో ఆన్-డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ (Constable) అన్వర్ భాషా (Anwar Basha)పై దాడి చేశాడు (Attacked). ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, పోలీసు విభాగంలోని కొన్ని వాస్తవాలను దాచే ప్రయత్నాలపై అనేక అనుమానాలు తలెత్తాయి. జూన్ 3 అర్ధరాత్రి, సాయి కుమార్ మద్యం మత్తులో (డ్రంక్ అండ్ డ్రైవ్) వాహనం నడుపుతూ పోలీసుల వాహన తనిఖీలో పట్టుబడ్డాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ (Breath Analyzer Test)లో అతని రక్తంలో 145% ఆల్కహాల్ (145% Alcohol Content) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ సందర్భంగా కానిస్టేబుల్ అన్వర్ భాషాతో సాయి కుమార్ వాగ్వాదానికి దిగాడు. ఎస్‌ఐ నరసింహులు (SI Narasimhulu) సాయి కుమార్ సంతకం తీసుకుని చలానా రాశారు. అయితే, ఈ ఘటన తర్వాత సాయి కుమార్‌ను కోర్టులో హాజరు పరచకుండా విడిచిపెట్టడం పలు ప్రశ్నలను లేవనెత్తింది.

ఎమ్మెల్యే ఇంట విచారణ..
ఘటన తర్వాత, శ్రీకాళహస్తి రూరల్ సీఐ రవి నాయక్, కానిస్టేబుల్ అన్వర్ భాషాను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే, సీఐ ఎదుటే సాయి కుమార్ కానిస్టేబుల్‌పై మరోసారి దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిని సీఐ రవి నాయక్ అడ్డుకున్నారని తెలుస్తోంది. జిల్లా పోలీసు అధికారులు ఈ ఘటనలో ఎమ్మెల్యే ఇంటికి కానిస్టేబుల్‌ను తీసుకెళ్లిన విషయాన్ని ధృవీకరించారు.
వాస్తవాలను దాచే ప్రయత్నం..
అయితే, శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహ మూర్తి, కానిస్టేబుల్‌పై దాడి జరిగినట్లు వచ్చిన వార్తలను అవాస్తవమని ఖండిస్తూ ఆడియో సందేశం విడుదల చేశారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదనంగా, డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలో సాయి కుమార్‌పై రాసిన చలానా ఆచూకీ లేకపోవడం, కానిస్టేబుల్ పెంచలయ్య తీసిన వీడియో క్లిప్‌లో సగం మాత్రమే విడుదల కావడం వంటి అంశాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.
ఎమ్మెల్యే ఒత్తిళ్లు, పోలీసుల నిర్లక్ష్యం..
ఈ ఘటనలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఒత్తిళ్లు చేస్తున్నారని, పోలీసు అధికారులు ఆ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి జరిగినప్పటికీ, బాధిత కానిస్టేబుల్‌కు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన విషయాలు ఇంటిలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ, తగిన చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

దాడి ఘటనపై ప్రశ్నలు..
- డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సాయి కుమార్‌ను కోర్టులో హాజరు పరచకుండా ఎలా విడిచిపెట్టారు?
- ఎస్‌ఐ నరసింహులు రాసిన డ్రంక్ అండ్ డ్రైవ్ చలానా ఎక్కడ ఉంది?
- బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ సమయంలో తీసిన వీడియో క్లిప్ సగం మాత్రమే ఎందుకు విడుదల చేశారు?
- ఎమ్మెల్యే ఇంటికి కానిస్టేబుల్‌ను తీసుకెళ్లడం వెనుక ఉద్దేశం ఏమిటి?
సోషల్ మీడియాలో వైరల్
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసు విభాగంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఎమ్మెల్యే ఒత్తిళ్లకు పోలీసు అధికారులు లొంగిపోతున్నారని, వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లా పోలీసు విభాగంలోని పారదర్శకత, జవాబుదారీతనం లోపాలను బహిర్గతం చేసింది. బాధిత కానిస్టేబుల్ అన్వర్ భాషాకు న్యాయం జరిగే వరకు, ఈ ఘటనపై విచారణ పారదర్శకంగా జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఒత్తిళ్లు, పోలీసుల నిర్లక్ష్యం ఈ కేసును మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.
కానిస్టేబుల్ అన్వర్ భాషాపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భార్య రిషిత రెడ్డి కారు డ్రైవర్ సాయి కుమార్ దాడి కలకలం
— Telugu Feed (@Telugufeedsite) June 5, 2025
ఈనెల 3వ తేదీ అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన సాయికుమార్
ఎమ్మెల్యే భార్య కారు డ్రైవర్‌ను అంటూ కానిస్టేబుల్ తో వాగ్వాదం. బ్రీత్… pic.twitter.com/Q9bVKkCJXb