భారత్-పాక్ ఉద్రిక్తత.. తిరుమలలో హైఅల‌ర్ట్‌

భారత్-పాక్ ఉద్రిక్తత.. తిరుమలలో హైఅల‌ర్ట్‌

భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుతున్న తరుణంలో తిరుమల (Tirumala)లో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దేశ సరిహద్దుల్లో పెరిగిన అప్రమత్తత నేపథ్యంలో, పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో పోలీసులు అలర్ట్ (Alert) అయ్యారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ (SP) హర్షవర్ధన్ రాజు (Harshavardhan Raju) జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

భక్తుల భద్రతే అత్యవసరం అనే దృష్టితో, మధ్యాహ్నం నుంచే తిరుమలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. టెంపుల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఆధారంగా నిఘా కొనసాగుతోంది.

ప‌హ‌ల్గామ్ దాడి తరువాత తిరుమల తిరుపతిలో భద్రతను కట్టుదిట్టం చేసిన విష‌యం తెలిసిందే. తిరుమ‌ల కొండ‌పై భ‌ద్ర‌త బ‌ల‌గాలు మాక్ డ్రిల్ కూడా చేప‌ట్టాయి. కీలకమైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల ముప్పు ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో, టీటీడీ యంత్రాంగం అలర్ట్ అయింది. అలిపిరి తనిఖీ కేంద్రం మరియు ఘాట్ రోడ్లలో ఆర్టీసీ బస్సులతో పాటు అన్ని ప్రైవేట్ వాహనాలను, లగేజీని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా (Thoroughly) తనిఖీలు (Checking) చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment