తిరుమలలో మ‌ళ్లీ భ‌ద్ర‌తా వైఫ‌ల్యం..

తిరుమలలో మ‌రో అప‌చారం.. శ్రీ‌వారి కొండ‌పై న‌మాజ్

క‌లియుగ దైవం శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి (Sri Venkateswara Swamy) కొలువైన తిరుమ‌ల కొండ‌ (Tirumala Hill)పై భద్రతా వైఫల్యం (Security Lapse) మ‌రోసారి బయటపడింది. ఇటీవ‌ల కాలంలో స్వామివారి ఆల‌యంపై నుంచి విమానాల రాక‌పోక‌లు, కొండ‌పై మ‌ద్యం, మాంసాహార ప‌దార్థాలు, మందుబాబుల వీరంగం, అగ్నిప్ర‌మాదాలు, ఆఖ‌రికి న‌కిలీ ద‌ర్శ‌న టికెట్లు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

కాగా, తాజాగా గురువారం తిరుమలలోని పురోహిత సంఘం సమీపంలో ఒక అన్యమతస్థుడు నమాజ్ (Namaz) చేసిన వీడియోలు సోషల్ మీడియా వేదికలలో చక్కర్లు కొడుతున్నాయి. సీసీ కెమెరాల ఎదుట ఈ ఘటన జరిగినప్పటికీ, భద్రతా సిబ్బంది ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది.

గతంలో ఒక యూట్యూబర్ (YouTuber) తిరుమల ఆలయం సమీపంలో డ్రోన్ (Drone) ఎగరవేయ‌డం, అలిపిరి (Alipiri) వద్ద ఒక వ్యక్తి గందరగోళం సృష్టించడం, భక్తులు పాదరక్షలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడం వంటి భద్రతా లోపాలు బ‌య‌ట‌ప‌డ‌గా, తాజాగా కొండ‌పై అన్య‌మ‌త‌స్థుడు న‌మాజ్ చేస్తున్న వీడియో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. తిరుమ‌ల భ‌ద్ర‌త‌పై భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి దీనిపై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం క‌మిటీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment