పరమ పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి (Tirumala Sri Venkateswara Swamy) వారి లడ్డూ (Laddu)కు సంబంధించి కూటమి ప్రభుత్వం (Alliance Government) చేసిన ఆరోపణలు ఇప్పుడు బూటకమని తేలిపోయాయి. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్య నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అయితే, ఈ వివాదంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా కోర్టుకు సమర్పించిన నివేదికలో లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా పేర్కొంది. ఈ నివేదిక వెలుగులోకి రావడంతో, అప్పట్లో జరిగిన దుష్ప్రచారంపై భక్తుల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
టీటీడీ లడ్డు విషయంలో విషప్రచారం చేసి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పగలడా? pic.twitter.com/RP4RZEbhvH
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) January 24, 2026
రాజకీయాల కోసం దేవుడి పేరు
మాజీ సీఎం (Former Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy)ని బద్నాం చేయాలనే రాజకీయ దురుద్దేశంతో, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు, తిరుమల లడ్డూను రాజకీయాల్లోకి లాగారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అప్పట్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున దుమారం రేగగా, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా దీక్ష చేసి ఆరోపణలకు బలం చేకూర్చారు. అంతేకాదు, అయోధ్య (Ayodhya)కు పంపిన లడ్డూలు కూడా అవే అని పవన్ ఆరోపణలు చేయడం వివాదాన్ని మరింత పెంచింది.
తిరుమల లడ్డూపై విష ప్రచారం చేసి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినందుకు @ncbn, @PawanKalyan క్షమాపణలు చెప్తారా?#SaveTTDFromTDP #SaveTirumala #CBNFailedCM #JaganannaConnects pic.twitter.com/59e6hKMQt6
— Jagananna Connects (@JaganannaCNCTS) January 25, 2026
అబద్ధాలు బహిర్గతం.. భక్తుల్లో ప్రశ్నలు
సిట్(SIT) నివేదికతో కూటమి ప్రభుత్వ వాదనలు పూర్తిగా కూలిపోయాయి. లడ్డూలో జంతు కొవ్వు లేదని తేలడంతో, అప్పట్లో చేసిన ఆరోపణలకు బాధ్యత ఎవరు వహిస్తారు? కనీసం శ్రీ వారి భక్తులకు క్షమాపణ (Apology) చెప్పే సంస్కారం ఉందా? అనే ప్రశ్నలు సామాన్య ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి.
సోషల్ మీడియాలో భక్తుల గళం
లడ్డూలో అపవిత్రత లేదని తేలడంతో, భక్తులు ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలోకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీ వీడియోలు, పోస్టుల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టను దెబ్బతీయడం దుర్మార్గ చర్య అంటూ మండిపడుతున్నారు. రాజకీయాల కోసం దేవుడి పేరును వాడటం అనైతికమని, ఇది క్షమించరాని తప్పు అని వ్యాఖ్యానిస్తున్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ దుష్ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలి.#FekuChandrababu #TTD #Tirumala #AndhraPradesh #JaganannaConnects pic.twitter.com/W6rqsVUr5n
— Jagananna Connects (@JaganannaCNCTS) January 24, 2026
క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలేశుని సన్నిధానంపై అపవాదు మోపిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు వెంటనే శ్రీ వారి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిజం బయటపడిన ఈ సందర్భంలో, దేవుడిని రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలన్న డిమాండ్ కూడా భక్తుల నుంచి గట్టిగా వినిపిస్తోంది. మరి దీనిపై కూటమి పెద్దలు తిరుమలేశునికి, ఆయన భక్తులకు క్షమాపణలు చెబుతారా..? వేచి చూడాలి.
చంద్రబాబు నీలో ఇసుమంత నిజాయతీ ఉన్నా.. శ్రీవారి లడ్డు విషయంలో చేసిన నువ్వు చేసిన తప్పుడు ప్రచారానికి హిందువులకు క్షమాపణ చెప్పు pic.twitter.com/ZpkL9CQmzj
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) January 24, 2026







