ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త వచ్చేసింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ 2.0 (Trailer 2.0)ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
15 ఏళ్ల తర్వాత కామెడీ టైమింగ్
ట్రైలర్ 2.0 చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ప్రభాస్ (Prabhas) తన కామెడీ టైమింగ్‌తో ఫుల్ ఫామ్‌లో కనిపించబోతున్నాడు. హర్రర్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీని చాలా చక్కగా మేళవిస్తూ దర్శకుడు మారుతి (Maruthi) ఈ సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్ హింట్ ఇస్తోంది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌కు పండగే అన్నట్లుగా ఉన్నాయి.
రిలీజ్ డేట్‌తో అంచనాలు..
ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు మెరుస్తున్నారు. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ది కుమార్ (Riddhi Kumar), మాళవిక మోహనన్ (Malavika Mohanan) గ్లామర్‌తో పాటు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి 9వ తేదీన సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక హర్రర్-కామెడీ జానర్‌లో ప్రభాస్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో, సంక్రాంతి రేసులో ‘ది రాజా సాబ్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే.








