పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Pan-India Star Prabhas) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) మరోసారి సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపుతోంది. దర్శకుడు మారుతి (Maruthi) తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రంతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తన మార్క్ మరోసారి చూపించబోతున్నాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పీక్స్‌కు తీసుకెళ్లాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ పెప్పీ డ్యాన్స్ నెంబర్‌ను రిలీజ్ చేశారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ డిస్కో డ్యాన్సర్‌లోని ‘నాచె నాచె’ (Nache Nache) పాటను రీమిక్స్ చేసిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటలో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తమదైన ఎనర్జీతో అదరగొట్టారు. అయితే ముగ్గురు హీరోయిన్లు ఉన్నా… ప్రభాస్ డ్యాన్స్ మూమెంట్సే (Prabhas Dance Movements) ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
వింటేజ్ డార్లింగ్ లుక్‌తో పాటు అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డ్యాన్స్ స్టెప్పులతో ప్రభాస్ ఈ పాటలో ఇరగదీశాడు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సాంగ్‌కు విపరీతమైన స్పందన వస్తుండగా, ప్రభాస్ డ్యాన్స్‌ను ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
ఇక ‘ది రాజా సాబ్’లో హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ‘ది రాజా సాబ్’ ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగ తీసుకురానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.








