ఓటీటీలోకి ‘ముఫాసా: ది లయన్ కింగ్’

ఓటీటీలోకి ‘ముఫాసా: ది లయన్ కింగ్’

హాలీవుడ్ బ్లాక్ బ‌స్టర్ ‘ది లయన్ కింగ్ (2019)’ కి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘ముఫాసా… ది లయన్ కింగ్’ ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ చిత్రం భారతదేశంలో 2023 డిసెంబర్ 20న విడుదలై మంచి స్పందన పొందింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలుగు వెర్షన్‌లో ముఫాసాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. భారీ బడ్జెట్‌తో (సుమారు రూ.1260 కోట్లు) తెరకెక్కిన ఈ చిత్రం రూ.3,200 కోట్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది.

అంతటి ఘన విజయాన్ని సాధించిన ‘ముఫాసా.. ది లయన్ కింగ్’ ఫిబ్రవరి 18న Disney+ Hotstar లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ విజువల్ వండర్‌ని ఆస్వాదించవచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment