గ్రామీణ నేపథ్యం విడుదలైన బలగం సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. అలాంటి గ్రామీణ వాతావరణంతో శివాజీ, నవదీప్, బిందు మాధవి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘దండోరా’ (Dandora) చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. మురళీకాంత్ (Muralikanth) దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమైంది.
తాజాగా విడుదలైన టీజర్(Teaser)లో తెలంగాణ (Telangana) గ్రామీణ వాతావరణం స్పష్టంగా కనిపించింది. కథ అంచనా వేయటానికి వీలు కాకపోయినా, రియలిస్టిక్ టోన్‌తో టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా నందు చెప్పిన “చావుకు కూడా మ్యాచింగ్ డ్రెస్లు వేసుకోవాలని ఎవరు చెప్పారంటూ?” అనే డైలాగ్ ప్రేక్షకుల్లో మంచి కుతూహలం రేపుతోంది.
గ్రామీణ కథలు, నేటివిటికి దగ్గరగా ఉండే కథనాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి ఆకర్షణగా మారే అవకాశం కనిపిస్తోంది.








