టాలీవుడ్‌లో మరో రొమాంటిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘తండేల్’ (Thandel Movie) భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. నాగ చైతన్య(Naga Chaitanya) – సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన ఈ సినిమా, ప్రేక్షకుల ప్రేమతో మూడో వారంలోకి విజయవంతంగా ప్రవేశించింది. మేకర్స్ ‘బ్లాక్‌బస్టర్ లవ్ సునామీ’ అంటూ స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
థియేటర్లలో దూసుకెళ్తున్న ‘తండేల్’
ఇప్పటికే రూ.100+ కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, ఇంకా హౌస్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. కథ, సంగీతం, రొమాన్స్ మేళవించిన (Romantic Drama) ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన రానప్పటికీ, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్(OTT Release) లో స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.
ఫిబ్రవరి 7వ తేదీ ఈ సినిమా రిలీజ్ అవ్వగా, ప్రస్తుతం థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధిస్తోంది. హీరో, హీరోయిన్ నాగ చైతన్య- సాయి పల్లవి యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. మత్స్యకారుల జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.