సంక్రాంతి బరిలో దళపతి విజయ్ ‘జన నాయగన్’

దళపతి విజయ్ ‘జన నాయగన్’ సంక్రాంతి కానుక

కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్‌ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ సంక్రాంతి బరిలోకి దూసుకొస్తోంది. పూర్తిస్థాయి పాలిటిక్స్ లోకి వెళ్తున్న విజయ్.. జన నాయగన్ తన ఆఖరి సినిమా అని ప్రకటించేశారు. ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి.

విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చివరి సినిమాలోనూ విజయ్‌ కనిపించబోవడం వల్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే తమిళ వెర్షన్‌ వరల్డ్‌ వైడ్ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఇప్పటి వరకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారా రూ.15 కోట్లు వసూలు అయ్యాయని తెలుస్తోంది.

సినిమా ప్రారంభం నుంచే సోషల్ మీడియాలో ‘జన నాయగన్’ తెలుగు హిట్ మూవీ ‘భగవంత్‌ కేసరి’ రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. అయితే డైరెక్టర్ హెచ్‌.వినోద్‌ ఆ ప్రచారంపై స్పందించి, “నేను దీన్ని కన్‌ఫార్మ్ చేయను, లేదని కొట్టిపారేయను. ఇది దళపతి సినిమానే, ఏదైనా చిత్రం నుంచి స్ఫూర్తి తీసుకున్నా, రీమేక్‌ కాదని ప్రేక్షకులు తెలుసుకోవాలి. రేపు విడుదల కాబోతున్న ట్రైలర్‌ చూసి స్పష్టత వస్తుంది” అని తెలిపారు. ఈ మూవీకి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ జనవరి 3న విడుదల కానుంది అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment