రిలీజ్‌కు ముందే ‘జన నాయగన్’ రూ.400 కోట్ల బిజినెస్!

రిలీజ్‌కు ముందే 'జన నాయగన్' రూ.400 కోట్ల బిజినెస్!

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Vijay)తన సినీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు ప్రకటించడంతో, ఆయన చివరి చిత్రం ‘జన నాయగన్’పై అంచనాలు ఆకాశాన్నంటాయి. పూర్తిగా రాజకీయాల వైపు ఉన్న నేపధ్యంలో, ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని విజయ్ నిర్ణయించుకున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 2026 జనవరి 9న థియేటర్లలోకి రానుంది.

ఈ హైప్ కారణంగా, ‘జన నాయగన్’ విడుదల కంటే ముందే భారీస్థాయిలో ప్రీ-బిజినెస్ చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ చిత్రం దాదాపు రూ.338 కోట్లు బిజినెస్ చేసినట్టు టాక్. కేవలం తమిళనాడు, కేరళ థియేట్రికల్ హక్కులే రూ.115 కోట్లకు, ఓవర్సీస్ రైట్స్‌ రూ.78 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ హక్కులను ఏకంగా రూ.110 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది రజినీకాంత్ ‘కూలి’ OTT హక్కుల కంటే (రూ.100-110 కోట్లు) కొంచెం ఎక్కువ కావడం విశేషం. విజయ్ చివరి సినిమా కావడంతో ఆయన మాస్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రైమ్ ఈ భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పొలిటికల్ డ్రామా ఇండస్ట్రీలో కొత్త రికార్డులను క్రియేట్ చేయనుందని, ఈ ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు అభిమానుల నమ్మకాన్ని మరింతగా పెంచుతున్నాయని చెప్పవచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment