---Advertisement---

ఆ షాప్ ఖాళీ చేయాల్సిందే.. తలసానికి ఊహించని షాక్!

ఆ షాప్ ఖాళీ చేయాల్సిందే.. తలసానికి ఊహించని షాక్!
---Advertisement---

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరిన తర్వాత బీఆర్ఎస్ (BRS) నేతలపై దృష్టిసారించింది. గ‌త ప‌దేళ్ల‌లో జ‌రిగిన వ్య‌వ‌హారాల‌ను రేవంత్ సర్కార్ (Revanth Government) నిశితంగా ప‌రిశీలిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించడంలో ఆసక్తి చూపుతోంది. అధికారంలో లేకున్నా, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి సర్కార్ సిద్ధమవుతోంది.

ఆదర్శ్‌నగర్ షాప్ వివాదంలో తలసాని
ఈ క్రమంలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ (Talasani Srinivas Yadav)‌కు ఊహించని షాక్ తగిలింది. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని షాప్ నెంబర్ 8ను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్ర‌స్తుతం ఈ షాప్ త‌ల‌సాని ఆధ్వ‌ర్యంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. నోటీసులపై త‌ల‌సాని ఇంకా స్పందించకపోవడం పరిస్థితిని మరింత ఉత్కంఠంగా మారింది. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment