మ‌స్క్‌కు షాక్‌.. టెస్లాకు రూ.2100 కోట్ల భారీ జరిమానా

మ‌స్క్‌కు షాక్‌.. టెస్లాకు రూ.2100 కోట్ల భారీ జరిమానా

అమెరికా టెస్లా మొబైల్ దిగ్గజం టెస్లాకు ఫ్లోరిడాలోని కోర్టు షాకిచ్చింది. 2019లో చోటుచేసుకున్న ఓ ఘోర రోడ్డు ప్రమాదానికి కారణంగా టెస్లా కారులో ఉన్న ఆటోపైలట్ సిస్టమ్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ కేసులో విచారణ అనంతరం కోర్టు టెస్లాకు రూ. 2100 కోట్లు (సుమారు 242 మిలియన్ డాలర్లు) టెస్లా చెల్లించాలని తీర్పు ప్రకటించింది.

ప్రమాద వివరాలు
2019లో ఫ్లోరిడాలోని కీ లార్గో ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెస్లా కారు డ్రైవింగ్ చేస్తుండగా డ్రైవర్ జార్జ్ మెక్‌గీ, ఆటోపైలట్ మోడ్‌లో ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో అతని ఫోన్ కింద పడిపోవడంతో దాన్ని తీసేందుకు వంగి ఉండగా, ముందు ఉన్న వాహనాన్ని కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నైబెల్ బెనవిడెస్ లియోన్ అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె ప్రియుడు డిల్లాన్ గాయపడ్డాడు.

కోర్టు తీర్పు
ఈ ఘటనపై బాధితులు కోర్టును ఆశ్రయించగా, చాలా కాలం పాటు సాగిన విచారణ అనంతరం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 329 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించగా, అందులో 242 మిలియన్ డాలర్లు టెస్లా చెల్లించాలన్నది కోర్టు స్పష్టం చేసింది. మిగతా మొత్తాన్ని కారును నడిపించిన వ్యక్తి జార్జ్ మెక్‌గీ నుంచి వసూలు చేయాలని తీర్పులో పేర్కొంది.

టెస్లా స్పందన
ఈ తీర్పుపై టెస్లా అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ ఆటోపైలట్ సాంకేతికత భద్రమైనదని, డ్రైవర్ నిబంధనల ప్రకారం జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యతను మరిచిన కారణంగానే ఈ ఘటన జరిగిందని పేర్కొంది. ఈ తీర్పుపై త్వరలోనే అప్పీల్ దాఖలు చేస్తామని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment