ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్ నగరంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
సాయికుమార్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అతని కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు ఈ విషాదకరమైన విషయం తెలియలేదు. సాయికుమార్ ఫోన్ లాక్ చేసి ఉండడంతో కుటుంబ సభ్యులకు ఎలా తెలియజేయాలో తెలియక స్నేహితులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. చివరికి, మీడియా ద్వారా ఈ విషయం తెలియజేయాలని సాయికుమార్ స్నేహితులు భావిస్తున్నారు.