న్యూట్రల్ ముసుగు ధరించి ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ప్రతిపక్ష పార్టీలపై విషప్రచారం చేస్తున్న ఓ న్యూస్‌సైట్ బండారం బయటపడింది. `దేశం పెద్దలను ప్రసన్నం చేసుకొని మార్కులు కొట్టేయాలనే కురసబుద్ధితో దుష్ప్రచారమే తన అస్త్రంగా ఎంచుకున్న న్యూస్ వెబ్‌సైట్ నిర్వాహకుడి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ నాయకులు, సానుభూతి పరులు, మహిళా నేతలే టార్గెట్ చేసుకొని నిత్యం వారిపై తప్పుడు వార్తలు, సంబంధం లేని వ్యవహారాలు, నిందలు వేస్తూ, వేయిస్తున్న ఆ వ్యక్తి దేశం పెద్దలకు అత్యంత సన్నిహితుడు అని తేలింది.
తెలుగు 360 అని స్వచ్ఛమైన భాష పేరునే తన న్యూస్‌సైట్‌కు పెట్టుకొని 360 డిగ్రీస్‌లో విషప్రచారాన్ని వ్యాప్తి చేయిస్తున్నాడు. ఈ వెబ్‌సైట్, ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ నిర్వాహకుడు కొల్లి గోపాల్‌గా తేలింది. ఇతను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కొల్లి గోపాల్‌కు Tv9 మాజీ సీఈఓతో సత్సంబంధాలున్నాయి. టీడీపీకి అనుకూలంగా వార్తలు రాయించి, వాటిని వెబ్‌సైట్లతో పాటు ట్విట్టర్ వేదికగా పోస్టులు చేయించి తాను రాసిందే నిజం అని నమ్మించడం కోసం టీడీపీ సోషల్ మీడియాను వాడుకుంటున్నట్లుగా ఆ పార్టీ అంతర్గత వర్గాల సమాచారం.
ఇదంతా చేయిస్తున్న తెలుగు 360 నిర్వాహకుడు ఇటీవల తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబును కలిశారు. బాబుతో భుజంపై వేయించుకొని ఫక్తు టీడీపీ కార్యకర్తలా దిగిన ఫొటో ఒకటి బయటకువచ్చింది. టీడీపీ అగ్రనేతల మెప్పుకోసమే అతను ఇవన్నీ చేస్తున్నాడని, అమెరికాలో తలదాచుకొని ఇక్కడి ప్రజలు, వైసీపీపై విషప్రచారం చేయించడమే అతనికి అధిష్టానం ఇచ్చిన టార్గెట్ అని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అమెరికా నుంచి అతని డైరెక్షన్లతోనే ఏపీలోని టీమ్ వైసీపీ నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని తెలుస్తోంది.
జగన్‌పై చేసిన దుష్ప్రచారాలకు ఫలితంగా కూటమి ప్రభుత్వం నుంచి కీలక పదవిని ఆశిస్తున్నాడని, అందుకే చంద్రబాబును కలిసి ఉంటాడని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. తెలుగు 360 వ్యవహారశైలిపై నెటిజన్లు సైతం విమర్శలు కురిపిస్తున్నారు. ముసుగు తొలగిపోయాక.. ‘తెలుగుదేశం 360’ అని పేరు పెట్టుకుంటే సరిపోతుందని కదా అని గోపాల్‌కు సలహా సైతం ఇస్తున్నారు.








