తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఇవాళ కాకినాడ పోర్టు (Kakinada Port) లో పర్యటించనున్నారు. తెలంగాణ సర్కారు ఫిలిప్పీన్స్ (Philippines) కు బియ్యం (Rice) ఎగుమతికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, మొత్తం 8 లక్షల టన్నుల ఎంటీయూ 1010 రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్‌కు పంపనున్నారు.
ఈ ఒప్పందం అమల్లో భాగంగా, తొలి విడతగా 12,500 టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి షిప్ (Ship) ద్వారా రవాణా చేయనున్నారు. ఈ రోజు ఆ షిప్ బయలుదేరనుండగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ఈ ఎగుమతిని అధికారికంగా ప్రారంభించనున్నారు.