తెలంగాణ మున్సిపల్ పోలింగ్.. పలుచోట్ల ఉద్రిక్తతలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలోని వార్డులు, డివిజన్లకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 25,49,750 మంది ఉండగా, మహిళలు 26,67,025 మంది ఉండటం విశేషం. ఇతరులు 638 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటంతో ఈ ఎన్నికల్లో వారి పాత్ర కీలకంగా మారనుంది.

ఇప్పటికే 116 మునిసిపాలిటీల పరిధిలోని 2,582 వార్డుల్లో 12 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. కాగా, పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన కాసేపటికే పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ – కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదాలు, దాడులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్ పేపర్లు తారుమారు అయిన పరిస్థితి నెలకొంది.

పట్టణ స్థానిక సంస్థల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయి. భారీగా పోలింగ్ నమోదవుతుందా? ప్రజలు ఎవరికి పట్టం కడతారు? అన్న ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment