తెలంగాణ ఉద్యమ చరిత్ర.. కేసీఆర్ దీక్షే మలుపు!

తెలంగాణ ఉద్యమ చరిత్ర.. కేసీఆర్ దీక్షే మలుపు!

2009 నవంబర్ 29న ప్రారంభించిన కేసీఆర్ గారి ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో” అనే నినాదంతో మొదలైన ఈ దీక్ష, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సరికొత్త చరిత్రకు నాంది పలికింది.

‘రానే రాదు, కానే కాదు’ అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసేందుకు కేసీఆర్ సబ్బండ వర్గాలను ఏకం చేసి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో అలుపెరగని పోరాటం చేశారని హరీష్ రావు కొనియాడారు. పదవుల కంటే తెలంగాణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ ధీరత్వం కేసీఆర్‌ది అని, ఆయనే తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకమని, నాలుగు కోట్ల ప్రజల్లో మార్మోగే ‘జై తెలంగాణ’ అనే రణ నినాదమని ఆయన పేర్కొన్నారు.

నవంబర్ 29న కేసీఆర్ గారి దీక్ష లేకుంటే, అప్పటి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసేది కాదని, తద్వారా తెలంగాణ రాష్ట్రమే ఏర్పడేది కాదని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటంతోనే సిద్ధించిందే తప్ప, పాలకుల దయాదాక్షిణ్యాలతో కాదన్నది అక్షర సత్యమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కేసీఆర్ గారి దీక్షా కాలం నాటి ఉద్యమ జ్ఞాపకాలు తన గుండెలో పదిలంగా ఉన్నాయని, అవి నిత్యం జై తెలంగాణ అని నినదిస్తూ, తెలంగాణ స్ఫూర్తిని రగిలిస్తున్నాయని హరీష్ రావు తమ ట్వీట్‌లో భావోద్వేగంగా వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment