దుబాయ్ (Dubai) లో ఇటీవల చోటుచేసుకున్న హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ (Telangana) రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక పాకిస్తానీ (Pakistani) చేతిలో దారుణ హత్య (Brutal Murder)కు గురయ్యారు. మత విద్వేషమే ఈ దాడికి కారణమని సమాచారం. ఈ ఘోర ఘటన గత శుక్రవారం దుబాయ్‌లోని ఓ ప్రసిద్ధ బేకరీ లో జరిగింది. నిర్మల్ జిల్లా (Nirmal District) సోన్ మండల కేంద్రానికి చెందిన ప్రేమ్ సాగర్ (Prem Sagar) (40) జీవనోపాధి కోసం ఆరేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ‘మోడ్రన్ బేకరీ (Modern Bakery)’ అనే హోటల్ (Hotel) లో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన, మధ్యలో స్వదేశానికి వచ్చి తిరిగి ఏడాదిన్నర క్రితం మళ్లీ దుబాయ్‌కు వెళ్లారు. అదే బేకరీలో పనిచేస్తున్న పాకిస్తానీ వ్యక్తి ప్రేమ్ సాగర్‌పై కత్తితో వెనక నుంచి దాడి చేసి హత్య చేశాడు. ఈ విషయం అక్కడి బంధువుల ద్వారా కుటుంబానికి తెలిసింది.
ఇంకొకరు మృతి, ఇద్దరు గాయాలు
ఈ దాడిలో నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు చెందిన శ్రీనివాస్ (Srinivas) అనే వ్యక్తి కూడా మృతి (Death) చెందాడు. ఇక మరొక ఇద్దరు తెలుగు వ్యక్తులు (Telugu Individuals) గాయపడినట్టు సమాచారం. దాడి అనంతరం ఆ పాకిస్తానీ వ్యక్తి మతపరమైన నినాదాలు చేయడంతో అక్కడి భారతీయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
హత్యకు గురైన ప్రేమ్ సాగర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఈ విషాదకర ఘటన గురించి అధికారికంగా ఇంకా తెలియజేయలేదని సమాచారం. దుబాయ్ పోలీసులు కేసును పూర్తిగా విచారించిన అనంతరం మృతదేహాలను స్వదేశానికి పంపించనున్నట్టు తెలుస్తోంది.