తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏకంగా 45 మంది ఐఏఎస్ అధికారులను పునర్విభజించింది. పరిపాలనలో వేగం పెంచడం, శాఖల పనితీరును మరింత సమర్థవంతం చేయడం లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా సంజయ్ కుమార్, SPDCL సీఎండీగా జితేశ్ వి. పాటిల్, కొత్త డిస్కం సీఎండీగా ముషారఫ్ ఫారూకీ, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ. శ్రీధర్, ఐటీ & సీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్, ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్ నియమితులయ్యారు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఎం. దాన కిషోర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా బాధ్యతలు స్వీకరించనున్నారు.
జిల్లా స్థాయిలో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బి. విజయేంద్ర, కరీంనగర్ కలెక్టర్‌గా చిత్ర మిశ్రా, హన్మకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్, యాదాద్రి కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, జనగాం కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా నియమితులయ్యారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శబర్ష్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరిమా అగర్వాల్, వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా దీపక్ తివారీ, మెదక్ జిల్లా కలెక్టర్‌గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. పరిపాలనలో చురుకుదనం తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన ఈ భారీ బదిలీలు రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.








