ఆధార్ అప్‌డేట్ ఉంటేనే ఉచిత ప్రయాణం!

ఆధార్ అప్‌డేట్ ఉంటేనే ఉచిత ప్రయాణం!

తెలంగాణ (Telangana)లో మహిళలకు (Women) ఉచిత బస్సు (Free Bus)ప్రయాణం అందించే మహాలక్ష్మి (Mahalakshmi) పథకంలో (Scheme) ఇప్పుడు కొత్త నిబంధనలు వస్తున్నాయి. కొన్ని ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ప్రయాణికులను ఆధార్ కార్డు (Aadhaar Card) అప్‌డేట్ (Update) చేయించుకోవాలని కోరుతున్నారు. “అమ్మా, ఆధార్ కార్డు అప్‌డేట్ ఉంటేనే ఉచిత ప్రయాణం. లేకపోతే టికెట్ కొనాల్సిందే” అని కండక్టర్లు (Conductors) చెబుతున్నారు.

ఆధార్ కార్డులో చిరునామా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అని ఉన్నవారికి ఈ నిబంధన వర్తిస్తుందని కండక్టర్లు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడి ఇన్నేళ్లయినా, కొందరు తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోలేదు. పాత ఉమ్మడి జిల్లాల పేర్లతోనే లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుతోనే వారి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కండక్టర్లు మహిళా ప్రయాణికులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ అంత సులభంగా జరగడం లేదు. దీంతో ఉచిత ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడుతాయేమోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అధికారికంగా ఈ విషయంలో ఏమైనా ఆదేశాలు ఉన్నాయా, లేదా అనేది తెలంగాణ ఆర్టీసీ ఇంకా స్పష్టం చేయలేదు.

సిగ్నల్ లేదు, డబ్బులు ఇవ్వండి!

మరోవైపు, తెలంగాణ ఆర్టీసీ క్యాష్‌లెస్ పేమెంట్‌ను ప్రోత్సహిస్తున్నప్పటికీ, కొన్ని బస్సుల్లో కండక్టర్లు QR కోడ్ పేమెంట్‌లకు సహకరించడం లేదు. ప్రయాణికుల రద్దీ కారణంగా లేదా ఇతర సాంకేతిక సమస్యల వల్ల కావచ్చు, “సిగ్నల్ లేదు, మెషిన్ పనిచేయడం లేదు” వంటి కారణాలు చెబుతూ నగదు చెల్లించాలని కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సుల్లో ప్రయాణించేవారు ఈ పరిస్థితిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై కూడా ఆర్టీసీ స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment