మళ్లీ తెరపైకి తెలంగాణ‌-మ‌హారాష్ట్ర‌ సరిహద్దు వివాదం!

మళ్లీ తెరపైకి తెలంగాణ‌-మ‌హారాష్ట్ర‌ సరిహద్దు వివాదం!

తెలంగాణ–మహారాష్ట్ర (Telangana–Maharashtra) మధ్య స్తబ్దంగా ఉన్న సరిహద్దు వివాదం (Border Dispute) మళ్లీ చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర సీఎం (Maharashtra CM) దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis) చేసిన “వివాదాస్పద గ్రామాలు తమవే” అన్న ప్రకటన సంచ‌ల‌నంగా మారింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆరు గ్రామాల ప్రజలు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. “తెలంగాణలోనే కొనసాగుతాం” అంటూ వారు వినతిపత్రం సమర్పించారు.

మళ్లీ వెలుగులోకి వచ్చిన వివాదం
ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై (Mumbai)లో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 11 మంది సరిహద్దు గ్రామాల నాయకులు ప్రజాప్రతినిధులను కలుసుకున్నారు. గ్రామాల భవితవ్యంపై స్పష్టత కావాలని కోరడంతో ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. 1955–56లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన సమయంలో ఫజల్‌ అలీ (Fazal Ali) కమిషన్‌ సిఫార్సు (Commission Recommendations)ల ప్రకారం 14 గ్రామాలు మహారాష్ట్రలోకి వెళ్లాయి. 1978లో మహారాష్ట్ర–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మరోసారి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా హద్దులు నిర్ణయించాయి. ఆ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనలో ఉండాలని ఆర్టికల్‌–3 ప్రకారం ఒప్పందం కుదిరింది.

ముకదంగూడ (Mukadanguda)కు చెందిన సామాజిక కార్యకర్త రాందాస్‌ నర్వడే (Ramdas Narwade) తెలిపిన వివరాల ప్రకారం, 1980లో మహారాష్ట్రలో విలీనం కావాలని ఉద్యమం ప్రారంభమైంది. 1983లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను పరిశీలించింది. 1990లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కే చెందుతాయని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 1993లో ఆ ఉత్తర్వులు రద్దయ్యాయి.

కోర్టులోకి చేరిన వివాదం
1996లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హైకోర్టు (High Court)లో రిట్‌ పిటిషన్ వేసి, అదే ఏడాది సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (SLP No. 10338/96) దాఖలు చేసింది. కానీ 1997లో సుప్రీంకోర్టు సూచనతో ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ ప్రజలలో అసంతృప్తి మిగిలింది.

పాలనలో గందరగోళం
ప్రస్తుతం 14 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిపాలనలోనే కొనసాగుతున్నాయి. రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు రెండూ ప్రజల వద్ద ఉన్నాయి. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీలు రెండూ రాష్ట్రాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కొన్ని గ్రామాలలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకపోవడం, భూముల పట్టాలు మంజూరు కాకపోవడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ, రెండు రాష్ట్రాలూ పాలనను కొనసాగిస్తున్నాయి.

భాషా ప్రాతిపదికన విభజనపై వాదనలు
మరాఠీ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారని, భాష ఆధారంగా గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని వాదిస్తున్నారు రాజురా ఎమ్మెల్యే వామన్‌రావు చటప్‌. అసెంబ్లీలోనూ దీనిపై చర్చ జరిగింది. అయితే మరోవైపు, గిరిజనులకు అటవీ హక్కులు, ఇళ్ల పథకాలు, తాగునీరు–సాగునీరు వంటి సదుపాయాలు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైపు గ్రామస్తులు మొగ్గు చూపుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment