తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం షాపులకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 3 లక్షలు, ఇది తిరిగి చెల్లించబడదు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, గీత కార్మికులకు (గౌడ్స్) 15 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లకు కేటాయించిన దుకాణాలను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు.

అక్టోబర్ 23న కొత్త దుకాణాల కేటాయింపు కోసం డ్రా నిర్వహిస్తారు. డ్రాలో లైసెన్స్ పొందినవారు మొదటి విడత ఫీజును అక్టోబర్ 23 నుండి 24 మధ్య చెల్లించాలి. మొత్తం లైసెన్స్ ఫీజును ఆరు విడతలుగా చెల్లించే అవకాశం ఉంది. కొత్త లైసెన్స్‌లు డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు రెండేళ్ల కాలానికి వర్తిస్తాయి.

లైసెన్స్ ఫీజు వివరాలు (జనాభా ఆధారంగా):
5 వేల వరకు: రూ. 50 లక్షలు

5 వేల నుంచి 50 వేల వరకు: రూ. 55 లక్షలు

50 వేల నుంచి 1 లక్ష వరకు: రూ. 60 లక్షలు

1 లక్ష నుంచి 5 లక్షల వరకు: రూ. 65 లక్షలు

5 లక్షల నుంచి 20 లక్షల వరకు: రూ. 85 లక్షలు

20 లక్షల పైన: రూ. 1.10 కోట్లు

Join WhatsApp

Join Now

Leave a Comment