సెంటీమీటర్ సొరంగం తవ్వలేదు కానీ మాపై విమ‌ర్శ‌లా? – కేటీఆర్ ఆగ్రహం

సెంటీమీటర్ సొరంగం తవ్వలేదు కానీ మాపై విమ‌ర్శ‌లా? - కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం (SLBC Tunnel Accident) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ట్విట్ట‌ర్‌లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

“సెంటీమీటర్ సొరంగం తవ్వలేని సీఎం.. 12 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటు” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 13 నెలలుగా ప్రాజెక్టు పనులను పూర్తిగా పక్కన పెట్టి, తన వైఫల్యాన్ని గత ప్రభుత్వంపై నెట్టాలనే కుట్ర చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.

కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు..
కేటీఆర్ తన ట్వీట్‌లో “కళేశ్వరం ప్రాజెక్టులో 203 కిలోమీటర్ల టన్నెళ్లు తవ్వినా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. కాని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో నాలుగు రోజుల్లోనే ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం సీఎం వైఫల్యానికి నిదర్శనం” అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రూ.3900 కోట్ల ప్రాజెక్టు పనులు పూర్తి చేసిన వాస్తవాన్ని దాచేందుకు సీఎం చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయని, కాంగ్రెస్ పాలనలో చేసిన తప్పులను ఒప్పుకోవడం తప్ప ఇతర మార్గం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment