తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తాజాగా ఆరుగురు IAS అధికారులను, 23 మంది IPS అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ స్థాయి బదిలీల్లో హైదరాబాద్ (Hyderabad) పోలీస్ కమిషనర్ (Police Commissioner)గా వీసీ సజ్జనార్ (V.C.Sajjanar) నియమితులయ్యారు. గతంలో ఈ పదవిలో ఉన్న సీవీ ఆనంద్ (C.V.Anand)ను హోంశాఖ సెక్రెటరీగా నియమించారు.
ముఖ్యమైన నియామకాలు:
తెలంగాణ డీజీపీ: బత్తుల శివధర్‌రెడ్డి
హైదరాబాద్ పోలీస్ కమిషనర్: వీసీ సజ్జనార్
హోంశాఖ సెక్రెటరీ: సీవీ ఆనంద్
ఇంటెలిజెన్స్ డీజీ: విజయ్ కుమార్
ఆర్టీసీ ఎండీ: నాగిరెడ్డి
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ & సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్: శిఖా గోయల్
ఫైర్ వింగ్ డీజీ: విక్రమ్ సింగ్ మాన్
సీఐడీ చీఫ్: వీవీ శ్రీనివాసరావు
ఏసీబీ డీజీ (అదనపు బాధ్యతలు): చారుసిన్హా
ఇటీవల వివాదాస్పదంగా మారిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హరితను కొత్త సిరిసిల్ల కలెక్టర్‌గా నియమించారు.