తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్

తెలంగాణ హైకోర్టు (Telangana High Court) వెబ్‌సైట్‌లో ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా వెబ్‌సైట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అంతటితో ఆగకుండా, ఏకంగా హైకోర్టు సైట్‌లో బెట్టింగ్ సైట్‌(Betting Site)కు సంబంధించిన లింక్ ప్రత్యక్షమవడంతో ఉద్యోగులు, న్యాయవాదులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై హైకోర్టు రిజిస్ట్రార్ సిబ్బంది వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ (Hyderabad Cyber Crime Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హ్యాకర్లు ఎలా యాక్సెస్ సాధించారు, సర్వర్‌లో ఏదైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ హ్యాకింగ్ ఘటనతో కొద్దిసేపు హైకోర్టు వెబ్‌సైట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీని వల్ల ఆర్డర్ కాపీలు, కేసు వివరాలు తెరవడంలో న్యాయవాదులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, సిస్టమ్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి మరియు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి టెక్నికల్ టీమ్స్‌ చర్యలు ప్రారంభించాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్ కావడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment