---Advertisement---

తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే

తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే
---Advertisement---

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న సుజయ్‌పాల్‌ను తాత్కాలిక సీజేగా నియమించారు. ఈ మార్పు జస్టిస్‌ ఆలోక్‌ అరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అవ్వడంతో చోటుచేసుకుంది.

జస్టిస్ సుజయ్‌పాల్ ప్రస్థానం..
1964 జూన్ 21న జన్మించిన జస్టిస్ సుజయ్‌పాల్ విద్యా జీవితం బీకాం, ఎంఏ, ఎల్‌ఎల్‌బీతో ప్రారంభమైంది. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో చేరి న్యాయవాదిగా పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డులకు సేవలందించారు. 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2024 మార్చి 21న సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసుతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.

న్యాయరంగంలో కీలక మైలురాళ్లు..
జస్టిస్ సుజయ్‌పాల్ సీజేగా నియమితులవడం తెలంగాణ న్యాయరంగానికి మరింత శక్తిని అందించనుంది. ఆయన అనుభవం, న్యాయ పటిమతో రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు కొత్త దిశను చూపుతారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment