ఫార్ములా ఈ-రేసు కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు ఊరట లభించింది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే కేసుపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి, కేటీఆర్ తరఫున లాయర్ సుందరం వాదనలు వినిపించారు.
ఇరువర్గాలు న్యాయమూర్తి ముందు సుదీర్ఘమైన వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి తన తీర్పును వెల్లడించారు. 10 రోజుల వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని చెప్పారు. తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి సూచించింది. విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది.
ఫార్ములా ఈ-రేసుపై కేసు నమోదు చేయడంతో కేటీఆర్‌ను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చే సంకేతాలు వెలువడ్డాయి. తనపై నమోదైన కేసు నిలవదని, అరపైసా అవినీతి కూడా జరగలేదని కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే.