పదేళ్ల నాటి గ్రూప్-2 పరీక్షా ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు

పదేళ్ల నాటి గ్రూప్-2 పరీక్షా ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు

2015-16 సంవత్సరాలలో నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలపై (Exams) తెలంగాణ హైకోర్టు (TGPSC) తాజాగా ఒక కీలక తీర్పును వెలువరించింది. ఈ పరీక్షల ఫలితాలను పూర్తిగా రద్దు (Cancel) చేస్తూ న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షా ప్రక్రియపై అప్పటికే దాఖలైన అనేక పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను టీజీపీఎస్సీ స్పష్టంగా ఉల్లంఘించిందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

తీర్పు సందర్భంగా, టీజీపీఎస్సీ తన పరిధిని దాటి వ్యవహరించిందని, ముఖ్యంగా ఫలితాల ప్రక్రియలో పాటించాల్సిన విధివిధానాలు సరిగా పాటించలేదని న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గతంలో కోర్టు సూచించిన ప్రమాణాలను కమిషన్ పాటించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, గ్రూప్–2 పరీక్షలకు సంబంధించిన మొత్తం ఫలితాలను పునర్‌మూల్యాంకనం (Re-evaluation) చేయాలని, తద్వారా అర్హులైన కొత్త జాబితాను రూపొందించి విడుదల చేయాలని హైకోర్టు టీజీపీఎస్సీకి ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియను ఎనిమిది వారాలలోపు పూర్తి చేయాలని కోర్టు స్పష్టమైన గడువు విధించింది. ఈ చారిత్రక తీర్పుతో గ్రూప్–2 పరీక్ష రాసిన వేలాది మంది అభ్యర్థులలో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment