తెలంగాణ (Telangana)లో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా సిద్దిపేట, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి (ఆగస్టు 29, 30) సెలవులు (Holidays) ప్రకటించారు.
పరీక్షల వాయిదా
భారీ వర్షాల కారణంగా కాకతీయ (Kakatiya) విశ్వవిద్యాలయం (University) పరిధిలో ఆగస్టు 28, 29 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ (Registrar) ప్రొఫెసర్ (Professor) రాజేందర్ (Rajender) తెలిపారు. అలాగే, శాతవాహన (Satavahana) విశ్వవిద్యాలయం (University) పరిధిలో గురువారం జరగాల్సిన బీఎడ్, ఎంఎడ్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
వాతావరణ హెచ్చరిక
వాయువ్య బంగాళాఖాతం (Bay of Bengal)లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనం (Low-Pressure)గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.








