ఓజీ టికెట్ ధరల పెంపునకు మరోసారి షాక్

ఓజీ టికెట్ ధరల పెంపునకు మరోసారి షాక్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ(OG) టికెట్ ధరల (Ticket Prices) పెంపుపై మరోసారి షాక్ తగిలింది. ఇటీవ‌ల సినిమా టికెట్ ధ‌ర‌ల‌పై స్టే విధించిన తెలంగాణ (Telangana) హైకోర్టు (High Court).. ఇవాళ‌ రివ్యూ తర్వాత కూడా పెంపునకు అంగీకరించలేదు. టికెట్ ధరల పెంపుకు అనుమతించలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ (Single Bench) ఇచ్చిన పూర్వ ఉత్తర్వులను కొనసాగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

ఈ ఉత్తర్వులు అక్టోబర్ 9 వరకు అమల్లో ఉంటాయని ధ‌ర్మాసనం వెల్లడించింది. అంతేకాకుండా, టికెట్ ధరలను ఎందుకు పెంచాలని అనుకున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. కోర్టు తీర్పుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ సినిమాకు మ‌రోసారి బిగ్ షాక్ త‌గిలిన‌ట్లు అయ్యిందంటున్నారు అభిమానులు.

Join WhatsApp

Join Now

Leave a Comment