తెలంగాణ (Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికల (Local Bodies Elections) నోటిఫికేషన్‌పై హైకోర్టు (High Court) స్టే (Stay విధించింది. ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ, నాలుగు వారాల వ్యవధిలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
జీవో 9పై దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది. ఈ జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం సబబేనా అనే అంశంపై ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
విచారణ అనంతరం హైకోర్టు జీవో 9పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం, పిటిషనర్లు రెండు వారాల్లో, అలాగే ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ ఆదేశాలతో ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైన కౌంటర్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది.








