నార్వే చెస్ 2025లో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి (Arjun Erigaisi) సంచలనం సృష్టించాడు. అసాధారణ విజయం సాధించి రికార్డ్ నెలకొల్పాడు. నార్వే చెస్ టోర్నమెంట్లో రౌండ్ 10లో ప్రపంచ నంబర్ వన్ (World No.1) మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen)ను ఆర్మగెడ్డన్ గేమ్‌లో ఓడించి సెన్సేషన్‌గా నిలిచాడు. క్లాసికల్ గేమ్ (Classical Game) డ్రమాటిక్‌గా డ్రాగా ముగియగా, నిర్ణాయకమైన ఆర్మగెడ్డన్ (Armageddon) లో అర్జున్ కార్ల్‌సన్‌పై చెక్‌మేట్ విజయాన్ని సాధించాడు. ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాకుండా, భారత చెస్ చరిత్రలో గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రం హన్మకొండ (Hanumakonda)కు చెందిన 20 ఏళ్ల అర్జున్ ఈ టోర్నీలో మొత్తం 13 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచాడు. ఇక మరో భారత స్టార్ గుకేష్ (Gukesh) 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విజయం అర్జున్ ప్రతిభను ప్రపంచానికి చాటింది. అంతర్జాతీయ స్థాయిలో భారత యువ చెస్ ఆటగాళ్లు చురుగ్గా పోటీపడుతున్నారని మరోసారి స్పష్టమైంది.—
ఈ ఘనతతో తెలుగు యువతకి ప్రేరణ ఇచ్చిన అర్జున్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.








