అమెరికాలో ఘోర ప్రమాదం.. తెలంగాణ‌ యువతులు మృతి

అమెరికాలో ఘోర ప్రమాదం.. తెలంగాణ‌ యువతులు మృతి

అమెరికా (America)లోని కాలిఫోర్నియా రాష్ట్రం (California State)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి (Telangana State) చెందిన ఇద్ద‌రు యువ‌తులు దుర్మార‌ణం చెందారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన (Meghana), ముల్కనూర్ గ్రామ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన (Bhavana) ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం.

ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిన ఈ ఇద్దరు యువతులు రోడ్డు ప్రమాదం (Road Accident)లో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment