బోలెడన్ని ఆశలు, పాన్ ఇండియా లెవల్ ప్రచారంతో దావోస్ సదస్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బృందంపై.. అసలు అనుభవమే లేని రేవంత్ బృందం విజయం సాధించింది. పెట్టుబడులు ఆకర్షించడం, ఎంవోయూలు చేసుకోవడంలో చంద్రబాబుపై రేవంత్‌దే పైచేయి. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ తన విజయకేతనం ఎగరేసింది. ఈ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. కొత్తగా దాదాపు 50,000 ఉద్యోగాల అవకాశాలు సృష్టించబడతాయని అంచనా.
తెలంగాణ విజయమార్గం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు కలిసి దావోస్ వేదికగా పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల్లో కొన్ని భారీ అంతర్జాతీయ కంపెనీల నుంచి వచ్చినా, మెఘా వంటి స్థానిక కంపెనీల నుంచి వచ్చినవి కూడా ఉన్నాయి. ప్రతి ఒప్పందం అమలవుతుందన్న నమ్మకం లేకపోయినా, రాష్ట్రంపై పెట్టుబడిదారుల ఆసక్తిని ఇది స్పష్టంగా చూపిస్తుంది.
ఏపీకి ఒప్పందాలు లేక కొత్తరాగం..
దావోస్ సదస్సు పర్యటన నేపథ్యంలో విపరీతమైన ప్రచారం చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం అక్కడ ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేకపోయింది. భారీ బృందంతో వెళ్లిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ కేవలం ప్రచారం మాత్రమే చేసుకున్నారు తప్పితే.. ఒక్క ఒప్పందం కూడా కుదుర్చుకోలేకపోయారు. దావోస్ వేదిక “కనెక్టింగ్ సెంటర్” మాత్రమేనంటూ కొత్త వివరణలు ఇచ్చే ప్రయత్నం చేసినా, ఈ పరిణామం రాష్ట్ర ప్రజలను నిరాశపరిచింది.
ఖర్చులు & ఫలితాలు: బాబుపై విమర్శలు
దావోస్‌లో పాల్గొనడానికి ఏపీ సర్కారు దాదాపు రూ. 100 కోట్ల ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే, పెట్టుబడుల పరంగా ఎలాంటి ప్రతిఫలం లేకపోవడం, పారిశ్రామిక ప్రముఖులతో ఫొటోలకే పరిమితం కావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు దావోస్ పర్యటన మూలంగా ప్రజాధనం దుర్వినియోగం తప్ప.. ఏపీకి ఒరిగిందేమీ లేదని మండిపడుతున్నారు.
బాబు పర్యటనపై వైసీపీ సెటైర్లు..
సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై ప్రతిపక్ష వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. తెలంగాణ గత రికార్డులను అధిగమిస్తే.. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఒక్క ఎంవోయూ కూడా చేసుకోలేదు. చంద్రబాబు దావోస్ పర్యటన కోసం ‘రూ.100 కోట్ల ప్రజాధనం తగలేశారు. 3 రోజులు దావోస్లో చంద్రబాబు గప్పాలు కొట్టినా.. ఏపీకి వచ్చిన పెట్టుబడులు సున్నా’ అని సెటైర్లు పేలుస్తోంది.
రేవంత్‌తో పోలుస్తూ..
దావోస్ పర్యటనకు మొదటిసారి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ సుమారు రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారు. ఏపీ ఒక్క ఎంవోయూ కూడా కుదుర్చుకోకపోవడంతో సోషల్ మీడియా వేదికగా రేవంత్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. గురువు కంటే శిష్యుడే మేలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు సాధించి తనపై పెరుగుతున్న వ్యతిరేకతకు రేవంత్ బ్రేక్ వేసుకోగా, చంద్రబాబు ఆరోపణలు, విమర్శలు విపరీతమయ్యాయి. అటు సంక్షేమ పథకాల అమలు లేదు.. ఇటు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించకపోగా, రూ.100 కోట్ల ప్రజాధనాన్ని వృథాగా ఖర్చు చేశారని ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అవకాశాలు మిస్ చేసుకోవడం రాష్ట్ర ప్రజల్లో నిరాశను పెంచుతోంది.
పవన్‌ను టీడీపీ ఎదగనివ్వదు – కాపు నేత సంచలన వ్యాఖ్యలు