CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్ల (BC Reservations)పై తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడిన ఆయన, “బీసీ బిల్లు (BC Bill)ను కేంద్రం ఆమోదించకపోతే మోడీ (Modi)ని గద్దె దించుతాం” అని హాట్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ (Parliament)లో బీసీ బిల్లుపై చర్చ జరగాలని, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం ఆమోదించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. “బీసీ కోటా బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు నెలలుగా రాష్ట్రపతి (President) దగ్గర కూడా ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అపాయింట్మెంట్ ఇవ్వమని కోరినా, రాష్ట్రపతి ఇప్పటివరకు సమయం కేటాయించలేదు,” అని సీఎం విమర్శించారు.
తెలంగాణలో కులగణన (Caste Census) చేపట్టడం రాహుల్ గాంధీ (Rahul Gandhi) సూచన మేరకే జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. “రాహుల్ గాంధీ ఆశయం ప్రకారం 42 శాతం బీసీ కోటా బిల్లు తెచ్చాం. ఈ కోటా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం,” అని స్పష్టం చేశారు. కేంద్రం బిల్లులను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ, బుధవారం జంతర్ మంతర్ (Jantar Mantar) దగ్గర మహా ధర్నా (Mega Protest) నిర్వహించారు. ఈ ధర్నాకు సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు, పార్టీలోని బీసీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.








