---Advertisement---

‘ఆరు గ్యారంటీలు గోవిందా’.. బడ్జెట్‌పై కేటీఆర్ ఫైర్

'ఆరు గ్యారంటీలు గోవిందా'.. బడ్జెట్‌పై కేటీఆర్ ఫైర్
---Advertisement---

తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 3 లక్షల 4 వేల 965 కోట్ల బడ్జెట్‌ను రేవంత్ సర్కార్ ఆమోదించగా, దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కేటీఆర్.. “రైతులు, ప్రజలు బ‌డ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు, కానీ ఆరు గ్యారంటీలు గోవిందా అయ్యాయి. 420 హామీల్లో ఒక్కదానిపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. మహిళలకు మహాలక్ష్మి పథకం ప్రకటించలేదు, స్విగ్గీ-జొమాటో కార్మికుల గురించి మరిచిపోయారు. యాదవులకు గొర్రెల పంపిణీ, గౌడ్‌లకు ప్రత్యేక కోటా అన్న హామీలు గాలిలో కలిసిపోయాయి” అని మండిపడ్డారు.

కాంగ్రెస్ పాలన వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనం
కేటీఆర్ తన విమర్శలను మరింత తీవ్రతరం చేస్తూ, “తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పేకమేడలా కూలిపోతోంది. ఇది ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్. రాహుల్ గాంధీ అశోక్‌నగర్‌లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తానని ఫోజులిచ్చారు, కానీ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలేదు. నమ్మి ఓటు వేసిన ప్రజలను మోసం చేసిన బడ్జెట్ ఇది” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment