పండుగ త‌రువాతే క‌మ‌లం కొత్త సార‌ధి ఎంపిక

పండుగ త‌రువాతే క‌మ‌లం కొత్త సార‌ధి ఎంపిక

తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయంలో హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రక్రియను సంక్రాంతి వేడుకల అనంతరం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం నేత‌ల్లో తీవ్ర పోటీ నెల‌కొంది.

ఈ పదవికి సంబంధించి ఎంపీలు తీవ్రంగా పోటీప‌డుతున్నారు. డీకే అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్, ధ‌ర్మ‌పురి అర్వింద్‌, రఘునందన్ పేర్లు అధిష్టానం ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. బండి సంజ‌య్‌కి తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన అనుభ‌వం మెండుగా ఉన్న‌ప్ప‌టికీ.. ఈటల రాజేందర్, అరవింద్, రఘునందన్ పేర్లను అధిష్టానం షార్ట్ లిస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నియామక ప్రక్రియ చివరిదశకు చేరుకోవడంతో, వీరిలో ఎవరికీ అవకాశం దక్కుతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో పెరుగుతోంది.

ఏ నాయకుడికి అవకాశం?
రాష్ట్ర రాజకీయాలు వేడి పుట్టించిన ఈ పోటీలో, బీజేపీ అస్తిత్వాన్ని మరింత బలోపేతం చేసే నాయకుడిని ఎంపిక చేయడమే హైకమాండ్ లక్ష్యంగా ఉంది. సంక్రాంతి అనంతరం అధిష్టానం తీసుకోబోయే నిర్ణయం, పార్టీ భవిష్యత్తు దిశలో కీలకంగా నిలవనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment